మామిడి తోటలో మృతదేహం కలకలం

విశాఖ: పద్మనాభం మండలం రెడ్డిపల్లి మామిడి తోటలో మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. మృతుని వయసు సుమారు 30-35 ఏళ్లు ఉంటుందని, నీలం రంగు షర్ట్, నేవీ బ్లూ కలర్ నిక్కరు ధరించి ఉన్నాడని వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు శనివారం తెలిపారు. మృతుని ఆచూకీ తెలిస్తే పద్మనాభం సీఐ శ్రీధర్, ఎస్ఐ సురేశ్‌ను సంప్రదించాలని కోరారు.