'మే 7 నుంచి శ్రీ చెన్నకేశవస్వామి వారి బ్రహ్మోత్సవాలు'

TPT: గూడూరు పట్టణం కర్ణాల వీధిలోని శ్రీ చెన్నకేశవస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరగనున్నాయి. 7న అంకురార్పణ, 8న శేషవాహనం, 9న హంసవాహనం,10న సింహవాహనం,11న హనుమంత సేవ,12న గరుడసేవ,13న కళ్యాణోత్సవం,14న రథోత్సవం, అశ్వవాహనం,15న చంద్రప్రభ,16న వసంతోత్సవం,చక్రస్నానం,17న ఏకాంతసేవ తదితర కార్యక్రమాలు జరగనున్నట్లు ఆలయ ఈఓ తెలిపారు.