'సీపీఐ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలి'

KKD: భారత కమ్యూనిస్టు పార్టీ 28వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ రూపకల్పన చేసిన గోడ పత్రికలను పార్టీ రాష్ట్ర నేత తాటిపాక మధు ఆవిష్కరించారు. స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో మడగల రమణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మధు మాట్లాడుతూ.. ఒంగోలులో ఆగస్టు 23 నుంచి 25 వరకు మూడు రోజుల పాటు మహాసభలు నిర్వహిస్తామన్నారు.