సీతాయిపల్లి అటవీ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు
KMR: గాంధారి మండలం సీతాయపల్లి కంచ్మల్ అటవీ ప్రాంతం శివారులో ఇటీవల చిరుత సంచరించడంపై స్థానికంగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామని అటవీ అధికారులు తెలిపారు. భవానిపేట నుంచి బాన్సువాడకు వెళ్లే రహదారి అటవీ ప్రాంతం ఉన్నందున ఈ రహదారి గుండా ప్రయాణించేవారు సాయంత్రం 5 గంటల తర్వాత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.