21,143 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

MNCL: ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులు నాణ్య మైన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 2,395 మంది రైతుల నుంచి 21,143 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. సేకరించిన ధాన్యానికి రైతుల ఖాతాల్లో రూ.5.73 కోట్లు నగదు జమ చేసినట్లు పేర్కొన్నారు.