రష్యా చమురుతో వెళ్తున్న ట్యాంకర్‌పై దాడి

రష్యా చమురుతో వెళ్తున్న ట్యాంకర్‌పై దాడి

ముడి చమురుతో రష్యా నుంచి టర్కీకి బయలుదేరిన ట్యాంకర్‌పై దాడి జరిగింది. ఇస్తాంబుల్‌కు 28 కి.మీ దూరంలో నల్ల సముద్రంలోని బోస్ఫరస్ జలసంధి వద్ద ఈ దాడి చోటుచేసుకుంది. మనవరహిత ఉపరితల వాహనంతో ఈ దాడి చేసినట్లు టర్కీ రవాణాశాఖ మంత్రి వెల్లడించారు. ఈ ఘటనలో నౌక ఇంజిన్‌లో మంటలు చెలరేగగా తీవ్ర నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ నౌకను టర్కీ కంపెనీ నిర్వహిస్తోంది.