'మన ఊరు-మన జెండాను జయప్రదం చేయాలి'
కోనసీమ: జిల్లాలోని ప్రతి గ్రామంలో 'మన ఊరు-మన జెండా' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ పిలుపునిచ్చారు. శనివారం వాడపల్లిలో ఆయన మాట్లాడారు. ఈ నెల 6న అన్ని గ్రామాల్లో పార్టీ స్థూపాలను ఏర్పాటు చేసి, జెండా ఎగురవేయాలని సూచించారు. అల్లు భాస్కరరావు ఆధ్వర్యంలో పార్టీ స్థూప నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.