రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్రగాయాలు

రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్రగాయాలు

ATP: పామిడి బ్రిడ్జి వద్ద ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుత్తి నుంచి అనంతపురం వైపు వెళ్తున్న స్కూటీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొనడంతో ఇద్దరి యువకులకు తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.