'రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి'
VZM: ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన ప్రతి గింజని కొనుగోలు చేయాలని నెల్లిమర్ల తహసీల్దార్ రమణ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలపై సహాయకులకు శిక్షణా కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల అనుగుణంగా రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు.