వైద్య పరీక్షల కోసం 8 కిలోమీటర్ల కాలినడక

వైద్య పరీక్షల కోసం 8 కిలోమీటర్ల కాలినడక

నాగర్ కర్నూలు: అచ్చంపేట మండలంలోని పద్మారం తండా గ్రామపంచాయతీ పులిదేవి బండ తండాకు చెందిన ఇద్దరు గర్భిణీలు వైద్య పరీక్షల కోసం 8 కి.మీ నడుచుకుంటూ వెళ్లారు. తండా నుంచి రోడ్డు సౌకర్యం లేక సిద్దాపూర్‌లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కాలినడకన వెళ్లాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రోడ్డు సౌకర్యంతో పాటు అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.