నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వినతి
KRNL: గోనెగండ్లలో నకిలీ కావేరి మొక్కజొన్న విత్తనాలతో నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని సీపీఐ నాయకులు తహసీల్దార్ రాజేశ్వరికి వినతిపత్రం సమర్పించారు. రైతులకు అబద్ధపు హామీలు ఇచ్చి నకిలీ విత్తనాలు అమ్మిన కావేరి సీడ్స్ కంపెనీపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మద్దిలేటి నాయుడు, మాలిక్ డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు.