దేవరకొండలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

NLG: దేవరకొండ మున్సిపల్ కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వై. సుదర్శన్ జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. మహనీయుల త్యాగఫలంతో స్వేచ్ఛ, స్వాతంత్య్ర సిద్ధించిందని తెలిపారు. సమరయోధుల అడుగుజాడల్లో ఇవాళ యువత నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.