VIDEO: అక్రమ పీడీఎస్ బియ్యం పట్టివేత
GNTR: పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రు గ్రామంలోని ఎస్సీ కాలనీలో నిన్న రాత్రి కంచర్ల కుమార్ అనే వ్యక్తి ఇంట్లో 7 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుబడ్డట్లు గ్రామ VRO తెలిపారు. ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ రేషన్ బియ్యాన్ని ఎవరికి తరలిస్తారనే కోణంలో విచారణ జరుగుతోందని పోలీసులు పేర్కొన్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.