రైతుల అభ్యున్నతికి సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

రైతుల అభ్యున్నతికి సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

గుంటూరు కలెక్టరేట్‌లోని శంకరన్ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం “రైతన్నా మీ కోసం” సదస్సు జరిగింది. కలెక్టర్ తమీమ్ అన్సారియా సదస్సును ప్రారంభించి, స్వర్ణాంధ్ర విజన్ యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాలని సూచించారు. రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందని, అన్ని శాఖలు సమన్వయంతో లక్ష్యాలను సాధించవచ్చని అన్నారు.