అమరావతిపై ధర్మాన వివాదాస్పద వ్యాఖ్యలు
AP: రాజధానిపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఒక చోటే ఉండాలని చెప్పడం సరికాదన్నారు. ప్రజల నిర్ణయంతో రాజధానిని మార్చే హక్కు ఉండాలని చెప్పారు. మద్రాస్ నుంచి అమరావతి వరకు రాజధాని మారలేదా? అంటూ ప్రశ్నించారు. రాజ్యాంగం పేరుతో ఒకేచోట బంధించడం సరికాదని పేర్కొన్నారు.