జీపీ ఎన్నికలు.. పంపిణీ కేంద్రాలివే
KNR: గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారులు ఖరారు చేశారు. ఆయా మండల కేంద్రాల్లో పంపిణీ ఏర్పాట్లు పూర్తి చేశారు. చొప్పదండి ZPHS బాయ్స్, గంగాధర ZPHS, రామడుగు ZPHS, కొత్తపల్లి ఎలగందల్ ZPHS, కరీంనగర్ గ్రామీణం ఎంపీడీఓ కార్యాలయంలో కేంద్రాలు ఏర్పాటు చేశారు.