బాధిత కుటుంబాలు నిత్యావసరాలు పంపిణీ

కోనసీమ: చింతనలంక గ్రామంలో సోమవారం మధ్యాహ్నం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. దీంతో మల్లాడి శ్రీహరి, కొత్తమ్మ నిరాశ్రయులయ్యారు. విషయం తెలుసుకున్న పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధితులకు తక్షణసాయంగా 25 కేజీల బియ్యం, బట్టలు, నిత్యావసర సరుకులు అందజేశారు.