VIDEO: జంబి ఆలయంలో హనుమాన్ జయంతి

VIDEO: జంబి ఆలయంలో హనుమాన్ జయంతి

NZB: ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారిని తమలపాకులతో విశేషంగా అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు బారులు తీరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జై హనుమాన్ నినాదాలతో ఆలయ పరిసరాలు భక్తి సాగరంగా మారాయి.