'CCI పరిశ్రమ ఏర్పాటుతో స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయి'

ADB: CCI పరిశ్రమ ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని MLA పాయల్ శంకర్ పేర్కొన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో సీసీఐ పునరుద్ధరణపై చర్చించినట్లు వెల్లడించారు. సీసీఐ పరిశ్రమ ఏర్పాటు ఆవశ్యకత ఉపాధి, తదితర విషయాలను సంబంధించిన కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.