గిరిజన సంతలో ఉచిత వైద్య శిబిరం
PPM: కురుపాం మండలం కేంద్రంలో గురువారం వారపు సంతలో డాక్టర్ శంకర్రావు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో రోగులకు రక్త పరీక్షలు నిర్వహించారు. అలాగే మలేరియా టైఫాయిడ్ డెంగు వంటి సీజన్ వ్యాధులపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఉచిత శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.