బీసీసీఐపై ఐసీసీ ఛైర్మన్ ప్రశంసలు 

బీసీసీఐపై ఐసీసీ ఛైర్మన్ ప్రశంసలు 

ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు ఐసీసీ ఛైర్మన్ జైషా శుభాకాంక్షలు తెలిపాడు. వారి విజయం దేశానికి స్ఫూర్తినిచ్చిందని కొనియాడాడు. ఈ గెలుపులో BCCI కీలక పాత్ర పోషించిందని చెప్పాడు. పురుష క్రికెటర్లతో సమాన వేతనాలు, నాణ్యమైన కోచింగ్ సిబ్బంది, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయలను కల్పించడం వంటి చర్యలు మహిళా క్రికెట్‌ అభివృద్ధికి బలమైన పునాది వేశాయని పేర్కొన్నాడు.