రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి
NZB: లింగంపేట- గాంధారి రహదారిపై నిన్నరోడ్డు ప్రమాదం జరిగింది. నల్లమడుగు గ్రామనికి చెందిన ధరావత్ దూప్ సింగ్ తన బైక్‌పై పల్లె ఈరవ్వ, మరో మహిళను ఎక్కించుకుంటున్న సమయంలో వేగంగా వచ్చిన లారీ బైక్‌ను ఢీకోట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఈరవ్వ మృతి చెందాగా, దూప్ సింగ్‌కు గాయలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.