గన్నవరంలో విద్యుత్ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన
కృష్ణా: గన్నవరం నియోజకవర్గంలోని రామవరప్పాడులో రూ. 4.20 కోట్లతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు MLA యార్లగడ్డ వెంకట్రావు మంగళవారం శంకుస్థాపన చేశారు. ప్రజల సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరిస్తున్నామని తెలిపారు. 9 గ్రామాలను VMCలో విలీనం చేయడం అవసరమన్నారు. త్వరలో అన్నా క్యాంటీన్, ప్రత్యేక పోలీస్ స్టేషన్, రైతు మార్కెట్లు ఏర్పాటు చేస్తామన్నారు.