క్లీన్ అండ్ గ్రీన్ పై అవగాహన సదస్సు

క్లీన్ అండ్ గ్రీన్ పై అవగాహన సదస్సు

కృష్ణా: కంకిపాడు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ప్రజారోగ్యం, పరిసరాల పరిశుభ్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలలో భాగంగా ఒక్కరోజు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలం గల గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. గ్రామాలలో మొక్కలు నాటడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి కార్యక్రమం చేపట్టారు.