కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్

NLG: నకిరేకల్ పట్టణ పరిధిలోని 10వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ చెవుగోని అఖిల- లక్ష్మణ్ 50 మంది తన అనుచరులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై చేరినట్లు పేర్కొన్నారు.