పేర్ని నానిపై చిలకలపూడి PSలో కేసు నమోదు
కృష్ణా: మాజీమంత్రి పేర్ని నానిపై చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిన్న అక్రమ నిర్మాణాల కూల్చివేతల నేపథ్యంలో ఆయన పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేశారు. జిల్లా పోలీస్ అధికారుల సంఘం ఫిర్యాదు మేరకు BNS 196, 353(2), 351 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, నిన్న అక్రమ నిర్మాణాల కూల్చివేత వద్ద ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే.