నరసింహస్వామి అవతారంలో శ్రీవారు
CTR: దసరా వేడుకలను పుంగనూరులో TTD వారు వైభవంగా నిర్వహిస్తున్నారు. పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో వేడుకలు కోనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం అర్చకులు శ్రీవారి ఉత్సవ మూర్తిని నరసింహస్వామి రూపంలో అలంకరించి పూజలు ఘనంగా చేశారు. అనంతరం భక్తుల దర్శనార్థం అద్దాల మండపంలో కొలువు తీర్చారు.