భారీ వర్షం.. పలుకాలనిలన్నీ జలమయం

KNL: కోడుమూరు మండలంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ ఎత్తున ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. మండలంలోని కోడుమూరు, వెంకటగిరి, గోరంట్ల, లద్దగిరి, తదితర గ్రామాల్లో భారీ వర్షం రావడంతో పలు వీధులన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ఆయా గ్రామాల్లో పంట పొలాలు పూర్తిగా నీటితో మునిగిపోయాయి. పలు రహదారులన్నీ నీటితో జలమయం అయ్యాయి.