ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకున్న ఎమ్మెల్యే

ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకున్న ఎమ్మెల్యే

సత్యసాయి: MLA పల్లె సింధూర రెడ్డి గురువారం పుట్టపర్తిలోని జానకి రామయ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేశారు. ముందుగా ఎమ్మెల్యేకు బ్రహ్మకుమారీలు ప్రత్యేక స్వాగతం పలికారు. జ్యోతిర్లింగాలను దర్శించుకున్న అనంతరం ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.