నాగర్ కర్నూల్‌లో 77.40% పోలింగ్ నమోదు
NGKL: జిల్లాలో జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 77.40 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూ లైన్లలో ఉన్నందున, తుది పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. పూర్తి గణాంకాలను మరికొద్ది సేపట్లో వెల్లడించనున్నారు.