VIDEO: పోలీస్ స్టేషన్‌కు చేరిన పదో తరగతి ప్రశ్నపత్రాలు
KRNL: ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సోమవారం ప్రశ్నపత్రాలు గోనెగండ్ల పోలీస్ స్టేషన్‌కు సురక్షితంగా చేరాయి. మండల విద్యాశాఖ అధికారి నీలకంఠ, ఇతర అధికారుల సమక్షంలో వాటిని పోలీసుల భద్రతలో భద్రపరిచారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎంఈఓ నీలకంఠ తెలిపారు.