రేపటి నుంచి మరో లక్ష మందికి పింఛన్లు పంపిణీ

రేపటి నుంచి మరో లక్ష మందికి పింఛన్లు పంపిణీ

ELR: రేపటి నుంచి లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ పంపిణీ కొనసాగుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఈ మేరకు నూజివీడులో మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రకటన విడుదల చేశారు. వితంతువులైన 1,09,155 మందికి గాను 43.66 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తామన్నారు.