సముద్ర తీర ప్రాంతాల్లో పర్యటించిన ప్రత్యేకాధికారి

సముద్ర తీర ప్రాంతాల్లో పర్యటించిన ప్రత్యేకాధికారి

VZM: సముద్ర తీర మత్స్యకార గ్రామాల్లో జిల్లా తుఫాను ప్రత్యేకాధికారి రవి సుభాష్ సోమవారం పర్యటించారు. పునరావాస కేంద్రాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి స్పెషల్ ఆఫీసర్‌ను కలిసి తీరప్రాంత పరిస్థితిని వివరించారు.