HPV వ్యాక్సిన్‌పై అవగాహన ర్యాలీలో పాల్గొన్న మంత్రి
కోనసీమ: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రామచంద్రపురంలో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళల కోసం పలు వినూత్న కార్యక్రమాలు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించేందుకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు.