ప్రారంభంలోనే జీవనశైలిని మార్చుకోవాలి: కలెక్టర్
HYD: సరైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్లే ఊబకాయం పెరుగుతోందని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. సికింద్రాబాద్ మెడికవర్ ఆస్పత్రిలో ఓబెసిటీ క్లినిక్‌ను ఆమె ప్రారంభించారు. ఊబకాయం వల్ల మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని ప్రారంభంలోనే జీవనశైలి మార్చుకుని వైద్యుల సలహాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి వైద్య నిపుణులు పాల్గొన్నారు.