గుంటూరులో NSUI ఆవిర్భావ వేడుకలు

గుంటూరులో NSUI ఆవిర్భావ వేడుకలు

GNTR: విద్యార్థిరంగ సమస్యల పరిష్కారంలో తమ విభాగం వరుసలో ఉంటుందని NSUI గుంటూరు జిల్లా అధ్యక్షుడు కరీమ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎన్ఎస్యూఐ 55వ ఆవిర్భావ వేడుకలు బుధవారం జరిగాయి. విద్యార్థులతో కలిసి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం NSUI జెండాను పార్టీ శ్రేణులతో కలిసి కరీమ్ ఆవిష్కరించారు.