ఖాజీపేట ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు

ఖాజీపేట ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు

KDP: ఖాజీపేటలో బాలికను గొంతుకోసి హత్య చేసిన ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు సూచనలు చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు.