VIDEO: ట్రాఫిక్‌కు అంతరాయం.. వ్యాపారస్తులపై కేసు నమోదు
NZB: డిచ్పల్లి పోలీసులు బుధవారం సాయంత్రం రైల్వే స్టేషన్, బస్టాండ్, మార్కెట్ ఏరియాలలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించి ముమ్మర తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా రోడ్లపైకి సామాగ్రిని పెట్టి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న 15 మంది వ్యాపారస్తులపై కేసులు నమోదు చేసినట్లు CI వినోద్ తెలిపారు. ఈ క్రమంలో వాహన తనిఖీలు జరిపి 10 బైకులు, 1 ఆటోను సీజ్ చేశామన్నారు