నకిలీ నోట్ల ముఠాలోని మరో ఇద్దరిపై పీడీ యాక్ట్

నకిలీ నోట్ల ముఠాలోని మరో ఇద్దరిపై పీడీ యాక్ట్

కామారెడ్డి: అంతర్‌రాష్ట్ర నకిలీ నోట్ల తయారీ, చలామణి ముఠాలోని మరో ఇద్దరు నిందితులపై నిన్న సాయంత్రం పీడీ యాక్ట్‌ అమలు చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఇప్పటికే ప్రధాన నిందితుడిపై ఈ యాక్ట్ అమలులో ఉందని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించే నేరాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు ఎలాంటి వెనుకంజ వేయరని ఎస్పీ స్పష్టం చేశారు.