చెరువులను తలపిస్తున్న రోడ్లు

SRD: పాలకులు మారిన గ్రామాల్లో పాలన వ్యవస్థ ఇంకా మారలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి నర్సింలు అన్నారు. శనివారం ఖేడ్ మండలం కాంజీ పురం తండాను సీపీఎం పార్టీ సభ్యులు పర్యటించారు. స్థానికులతో మాట్లాడి రోడ్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని పలు వీధుల్లో రోడ్డుపై వర్షం నీళ్లు నిలిచి చెరువులను తలపిస్తున్నాయని అధికారులు స్పందించి సీసీ రోడ్డు నిర్మించాలని కోరారు.