ఈనెల 29న జెడ్పీ సర్వసభ్య సమావేశం
VZM: ఈనెల 29న జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి బీవీ సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. సర్వ సభ్య సమావేశం ఆరోజు ఉదయం 11.00 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఛైర్మన్ మజ్జి శ్రీనివాస రావు అధ్యక్షతన జరుగుతుందన్నారు. ఈ సమావేశంకు సభ్యులు, అధికారులు హాజరు కావాలని విజ్ఞప్తి చేసారు.