అద్దాల షాపులో దొంగతనం.. కేసు నమోదు
KDP: పులివెందుల పట్టణంలోని కడప రోడ్డులో ఉన్న అద్దాల షాపులో శనివారం దుండగులు దొంగతనం చేశారు. ఈ షాప్లో ఉన్న అద్దాలు, హెల్మెట్లు, టోపీలను దుండగులు అపహరించుకుపోయారు. సుమారు రూ. 30 వేలు విలువ చేసే వస్తువులను దొంగలించడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.