చెరువును తలపిస్తున్న సీసీ రోడ్డు
ప్రకాశం: తర్లుపాడు మండలం తాడివారిపల్లి జండా వీధిలో సీసీ రోడ్డుపై మురుగునీరు చెరువును తలపిస్తోంది. పాఠశాలకు వెళ్తున్న విద్యార్థుల ఇబ్బందులు వర్ణనాతీతం. నిలిచిన మురుగు నీరువల్ల వీధి అంతా దుర్వాసన వెదజల్లుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య ఒక్కరోజుది కాదని, గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుందని వారు తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.