ఆయిల్ ఫామ్ సాగుతో దీర్ఘకాలిక ఆదాయం: AEO
MDK: ఆయిల్ ఫామ్ తోటలు సాగుతో దీర్ఘకాలిక ఆదాయం వస్తుందని నర్సాపూర్ మండల వ్యవసాయ అధికారి దీపిక అన్నారు. మండల పరిధిలోని నత్నాయపల్లి గ్రామానికి చెందిన పరమేశ్వర్, అశోక్ యాదవ్ అనే రైతుల వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ ఫామ్ మొక్కలను నాటారు. ప్రభుత్వం ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేసే రైతులకు సబ్సిడీపై మొక్కలు, డ్రిప్పు పరికరాలు సరఫరా చేస్తుందని తెలిపారు.