రేవంత్ మరోసారి సీఎం పీఠం అధిష్టిస్తారు: అద్దంకి

TG: సీఎం రేవంత్ రెడ్డి పేదల కోసం చేస్తున్న కృషికి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రశంసలు కురిపించారు. దేశంలో సన్నబియ్యం అందిస్తున్న ఘనత రేవంత్ రెడ్డిదేనన్నారు. రేవంత్ ఖచ్చితంగా మరోసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పేదల కోసం 200 యూనిట్ల ఉచిత కరెంట్, రూ.500కే గ్యాస్ అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను తాము నెరవేస్తున్నట్లు చెప్పారు.