ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం: మంత్రి
AP: రాష్ట్రంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.25 వేలు పరిహారంగా అందిస్తామన్నారు. అరటి పంటకు రూ.35 వేలు పరిహారం చెల్లిస్తామని వెల్లడించారు.