ఢిల్లీ టీమ్‌ను ఇంటికి పంపించాలి: ఉదయనిధి

ఢిల్లీ టీమ్‌ను ఇంటికి పంపించాలి: ఉదయనిధి

తమిళనాడు స్వయంప్రతిపత్తి కోసం ఈ ఎన్నికల్లో ఢిల్లీ టీమ్‌ను ఇంటికి సాగనంపాలని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రజలను కోరారు. ఈ ఎన్నికలను ఢిల్లీ టీమ్‌కు, తమిళనాడు టీమ్‌కు మధ్య జరిగే యుద్ధంగా ఆయన పేర్కొన్నారు. డీఎంకే కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తమిళనాడును నియంత్రించేందుకు ఢిల్లీ ఉపయోగిస్తున్న రిమోట్‌కంట్రోల్‌ను పగుల గొట్టాలన్నారు.