VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
BPT: జిల్లా కేంద్రం గడియారం స్తంభం వద్ద నిన్న రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధ రాత్రి చీరాల నుంచి వస్తున్న లారీని, సూర్యలంక నుంచి అతివేగంతో వస్తున్న ఓ బైక్  ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.