ఉద్యోగుల ప్రతిభకు 'ఎస్‌బీఐ-స్టార్‌' అవార్డ్‌

ఉద్యోగుల ప్రతిభకు 'ఎస్‌బీఐ-స్టార్‌' అవార్డ్‌

ఉద్యోగుల ప్రత్యేక ప్రతిభను గుర్తించేందుకు SBI ప్రత్యేక అవార్డులను ప్రకటించింది. SBI-స్టార్ పేరిట అవార్డులను ప్రదానం చేయనుంది. కళలు, సాహిత్యం, క్రీడలు, సామాజిక సేవతో పాటు ఇతర రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని ఈ అవార్డుతో సత్కరించనుంది. ఉద్యోగుల్లో ప్రోత్సాహం, సంస్థ పట్ల గౌరవం పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు SBI తెలిపింది.