పశువులకు గాలికుంటు నివారణ ఉచిత టీకాలు

పశువులకు గాలికుంటు నివారణ ఉచిత టీకాలు

KNR: ఇల్లందకుంట మండలం గడ్డివానిపల్లిలో పశు వైద్యశాల ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నివారణ కోసం ఉచిత టీకాల కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ గడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. పాడి రైతులు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని ఆయన సూచించారు. వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని తెలిపారు.